logo

Andhra News: నమ్మండి... ఇది జగనన్న కాలనీయే!

ఈ చిత్రంలో ముళ్లకంపలతో నిండి ఉన్న ప్రాంతం జగనన్న కాలనీ పేరుతో పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలు. 2020 డిసెంబరు 25న బుక్కరాయసముద్రం గోవిందపల్లి గ్రామంలో 30 మందికిపైగా లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చింది. రెండేళ్లవుతున్నా కాలనీలో తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పించక పోవడంతో లబ్ధిదారులు

Updated : 24 Mar 2022 07:41 IST

గోవిందపల్లిలో ముళ్లకంపలు పెరిగి ఇలా..

ఈ చిత్రంలో ముళ్లకంపలతో నిండి ఉన్న ప్రాంతం జగనన్న కాలనీ పేరుతో పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలు. 2020 డిసెంబరు 25న అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం గోవిందపల్లి గ్రామంలో 30 మందికిపైగా లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చింది. రెండేళ్లవుతున్నా కాలనీలో తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పించక పోవడంతో లబ్ధిదారులు కనీసం పునాది కూడా వేయలేదు. దీంతో ముళ్లకంపలు ఏపుగా పెరిగాయి. దీనికితోడు వర్షం వస్తే భారీగా నీరు నిలుస్తాయని గ్రామస్థులు చెబుతున్నారు. మరో ప్రదేశంలో స్థలాలు ఇవ్వాలని కోరుతున్నారు. రెవెన్యూ అధికారుల అనాలోచిత నిర్ణయం కారణంగా స్థలాలు వృథాగా మారాయి. ఈ విషయమై గృహనిర్మాణశాఖ ఏఈ వెంకటేశ్వరరావును వివరణ కోరగా వర్షం కురిస్తే కాలనీలో భారీగా నీరు నిలుస్తాయని లబ్ధిదారులు పునాదులు తవ్వడానికి ముందుకు రావడం లేదన్నారు. - న్యూస్‌టుడే, బుక్కరాయసముద్రం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని