logo

పెళ్లి చేసుకుంటానని బ్యాంక్‌ మేనేజర్‌ నుంచి రూ.46 లక్షలు దోచేసిన కి‘లేడి’

వివాహ వెబ్‌సైట్‌ ద్వారా పరిచయమై పెళ్లి పేరుతో ఓ మహిళ రూ.40 లక్షలు దోచేసిందని బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ కథనం ప్రకారం.. కోఠిలోని ఓ జాతీయ బ్యాంక్‌ మేనేజర్‌ పెళ్లి సంబంధాలు వెతుకుతున్నాడు. ఓ వివాహ వెబ్‌సైట్‌లో తన వివరాలు పొందుపర్చాడు.

Updated : 25 Mar 2022 07:13 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: వివాహ వెబ్‌సైట్‌ ద్వారా పరిచయమై పెళ్లి పేరుతో ఓ మహిళ రూ.46 లక్షలు దోచేసిందని బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ కథనం ప్రకారం.. కోఠిలోని ఓ జాతీయ బ్యాంక్‌ మేనేజర్‌ పెళ్లి సంబంధాలు వెతుకుతున్నాడు. ఓ వివాహ వెబ్‌సైట్‌లో తన వివరాలు పొందుపర్చాడు. ఓ అమ్మాయి ఫోన్‌ చేసి ‘మీరు నచ్చారు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా’నని తాను ముంబయి వాసినని ఫొటోలు, బయోడేటా పంపించింది. ఇద్దరు కొంతకాలం ఛాటింగ్‌ చేసుకున్నారు. చూడాలని ఉందనడంతో ఆ వ్యక్తి ఓసారి ముంబయికి వెళ్లి కలిసొచ్చారు కూడా. తర్వాత ‘మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు.. మరోసారి నాన్నకు బాగాలేదని.. ఇలా వివిధ కారణాలు చెబుతూ బాధితుని వద్ద నుంచి విడతల వారీగా రూ.46 లక్షలు దండుకుంది. తర్వాత ఫోన్‌లో అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని