logo

కలకలం.. గాజు సీసాతో పొడిచేందుకు ఉపాధ్యాయులను వెంబడించిన విద్యార్థి

తల వెంట్రుకలకు రంగు వేసుకోకూడదని చెప్పినందుకే ఓ విద్యార్థి ఏకంగా ఉపాధ్యాయులను చంపుతానని వెంబడించడం కలకలం రేపింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... సేలం జిల్లా ఆత్తూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న

Published : 28 Mar 2022 08:14 IST

సేలం, న్యూస్‌టుడే: తల వెంట్రుకలకు రంగు వేసుకోకూడదని చెప్పినందుకే ఓ విద్యార్థి ఏకంగా ఉపాధ్యాయులను చంపుతానని వెంబడించడం కలకలం రేపింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... సేలం జిల్లా ఆత్తూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న పుంగవాడికి చెందిన విద్యార్థి తలకి రంగు వేసుకొని పాఠశాలకి వచ్చాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు మందలించారు. విద్యార్థి అనుచితంగా మాట్లాడాడు. వెంటనే అతని తల్లిదండ్రులను పాఠశాలకి రప్పించి వారు విషయం చెప్పారు. ఆ విద్యార్థి శనివారం అకస్మాత్తుగా ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులను గాజు సీసాతో పొడిచేస్తాడని పేర్కొంటూ వెంబడించాడు. వారు ఓ గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విద్యార్థికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆ సమయంలో విద్యార్థి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు