logo

Hyderabad News: ‘నా కారు వదలండి.. లేదంటే మిమ్మల్ని సస్పెండ్‌ చేయిస్తా!’

ఎమ్మెల్యే అనుచరులుగా చెప్పుకొన్న వ్యక్తులు కొందరు మంగళవారం అర్ధరాత్రి బంజారాహిల్స్‌లో హంగామా సృష్టించారు. బంజారాహిల్స్‌ పోలీసులు, ట్రాఫిక్‌ పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2లోని

Updated : 31 Mar 2022 07:40 IST

ఎమ్మెల్యే అనుచరులమంటూ హంగామా

కిరణ్‌కుమార్‌రెడ్డి

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే అనుచరులుగా చెప్పుకొన్న వ్యక్తులు కొందరు మంగళవారం అర్ధరాత్రి బంజారాహిల్స్‌లో హంగామా సృష్టించారు. బంజారాహిల్స్‌ పోలీసులు, ట్రాఫిక్‌ పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2లోని పార్క్‌ హయత్‌ హోటల్‌ ముందు ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌అండ్‌డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి 1.40 గంటల ప్రాంతంలో కారు(టీఎస్‌ 07 జీఎస్‌ 1113)ను నిలిపి వాహనం నడుపుతున్న వ్యక్తికి శ్వాస విశ్లేషణ పరీక్షలు నిర్వహించగా రక్తంలో మద్యం మోతాదు శాతం 151 బీఏసీగా వచ్చింది. అతన్ని రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన వ్యాపారి టి.కిరణ్‌కుమార్‌రెడ్డి(34)గా గుర్తించారు. అతడి బంధువులు కేశంపేటవాసి యెన్నం శ్రీధర్‌రెడ్డి(47), మేడ్చల్‌ జిల్లా మేడిపల్లికి చెందిన హనుమంత్‌రెడ్డి(33), సైదాబాద్‌కు చెందిన వై.శ్రీకాంత్‌రెడ్డి(44), బోడుప్పల్‌కు చెందిన డ్రైవరు వి.నరేందర్‌రెడ్డి(31) అక్కడికి చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాము మేడ్చల్‌ ఎమ్మెల్యే అనుచరులమంటూ.. కారు ఇచ్చేయాలంటూ పోలీసులను నెట్టేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కల్పించారు. సస్పెండ్‌ చేయిస్తామంటూ బెదిరించారు. బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఉపేందర్‌ ఫిర్యాదు మేరకు కిరణ్‌కుమార్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు