logo

Crime News: కన్నబిడ్డను కొట్టిన తండ్రికి 37 రోజుల జైలు

ఎనిమిదేళ్ల కన్నబిడ్డను విచక్షణారహితంగా కొట్టిన ఓ తండ్రికి కోర్టు 37 రోజులపాటు జైలుశిక్ష విధించింది. చిలకలగూడ ఠాణా ఇన్‌స్పెక్టర్‌ నరేష్‌ కథనం ప్రకారం.. మెట్టుగూడ డివిజన్‌

Published : 01 Apr 2022 08:07 IST

సికింద్రాబాద్‌, న్యూస్‌టుడే: ఎనిమిదేళ్ల కన్నబిడ్డను విచక్షణారహితంగా కొట్టిన ఓ తండ్రికి కోర్టు 37 రోజులపాటు జైలుశిక్ష విధించింది. చిలకలగూడ ఠాణా ఇన్‌స్పెక్టర్‌ నరేష్‌ కథనం ప్రకారం.. మెట్టుగూడ డివిజన్‌ ఆలుగడ్డబావి ప్రాంతానికి చెందిన జి.శాంతికుమార్‌(35) ఇటీవల తన కూతుర్ని విపరీతంగా కొట్టాడు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసి గురువారం కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు 15 స్పెషల్‌ ఎంఎ కోర్టు న్యాయమూర్తి శాంతికుమార్‌కు నెల రోజుల జైలుశిక్షతోపాటు రూ.1100 జరిమానా విధించారు. జరిమానా కట్టని కారణంగా అదనంగా ఏడు రోజులు పొడిగిస్తూ 37 రోజుల జైలుశిక్షను విధించినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని