logo

పరీక్షల్లో కాపీ కొడుతున్నాడని విద్యార్థి చెయ్యి కొరికిన అధ్యాపకుడు

పరీక్షల్లో విద్యార్థులు కాపీ కొడుతుంటే అడ్డుకోవడం చూశాం.. మరీ పరిస్థితి విషమిస్తే డీబార్‌ చేసిన సందర్భాలూ ఉన్నాయి...

Updated : 02 Apr 2022 08:37 IST

శివమొగ్గ, న్యూస్‌టుడే : పరీక్షల్లో విద్యార్థులు కాపీ కొడుతుంటే అడ్డుకోవడం చూశాం.. మరీ పరిస్థితి విషమిస్తే డీబార్‌ చేసిన సందర్భాలూ ఉన్నాయి. శివమొగ్గ జిల్లా హొసనగర తాలూకా డిగ్రీ కళాశాలలో బీఏ పరీక్షల్లో కాపీ కొడుతున్న విద్యార్థి తీరు నచ్చక ఆ అధ్యాపకుడు ఏకంగా చేయి కొరికిన సంఘటన విస్మయం గొలిపింది. కాపీ కొడుతున్న విద్యార్థిని అధ్యాపకుడు మందలించారట. ఆ సమయంలో ఇద్దరి నడుమ వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన అధ్యాపకుడు విద్యార్థి చెయ్యి కొరికినట్లు సమాచారం. రెండు రోజుల కిందటి జరిగిన ఈ విషయం శుక్రవారం బయటకు పొక్కగా ఆ అధ్యాపకుడు ఈ సంఘటనపై మౌనం వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆయన మౌనంగా ఉన్నా కొందరు విద్యార్థులు ఈ సంఘటనను వైరల్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని