logo

Nara Lokesh: చిత్తూరు, చంద్రగిరి బాధ్యతలు నీవే: లోకేశ్‌

చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గంతో పాటు చంద్రగిరి శాసనసభ నియోజక వర్గంలో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత నీదేనని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తనతో అన్నారని పులివర్తి నాని తెలిపారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో లోకేశ్‌తో

Updated : 02 Apr 2022 08:04 IST


లోకేశ్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న పులివర్తి నాని

చిత్తూరు(జిల్లా పంచాయతీ): చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గంతో పాటు చంద్రగిరి శాసనసభ నియోజక వర్గంలో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత నీదేనని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తనతో అన్నారని పులివర్తి నాని తెలిపారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో లోకేశ్‌తో నాని భేటీ అయి జిల్లాలో పలు అంశాలపై చర్చించారు. తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలోనూ పార్టీని పటిష్టం చేసి, వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేలా కృషి చేయాలని లోకేశ్‌ తనకు సూచించినట్లు నాని తెలిపారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా సమర్థంగా నిర్వర్తిస్తానని ఆయన స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని