logo

Crime News: కోరిక తీర్చలేదని బావ ఘాతుకం.. బిడ్డ సహా మరదలి దారుణహత్య

తన లైంగిక కోరిక తీర్చలేదని తమ్ముడి భార్యను బిడ్డతోపాటు దారుణంగా నరికి చంపాడో కసాయి. హృదయ విదారకమైన ఈ ఘటన దిండిగల్లులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... దిండిగల్లు జిల్లా పెరియమలైయూర్‌ వలసైకి చెందిన శివకుమార్‌, అంజలై(22)

Updated : 04 Apr 2022 08:55 IST

విల్లివాక్కం(తమిళనాడు), న్యూస్‌టుడే: తన లైంగిక కోరిక తీర్చలేదని తమ్ముడి భార్యను బిడ్డతోపాటు దారుణంగా నరికి చంపాడో కసాయి. హృదయ విదారకమైన ఈ ఘటన దిండిగల్లులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... దిండిగల్లు జిల్లా పెరియమలైయూర్‌ వలసైకి చెందిన శివకుమార్‌, అంజలై(22) రెండేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు కుమార్తె మలర్‌విళి ఉంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం మేకలను మేపడానికి బిడ్డతో అడవికి వెళ్లిన అంజలై తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబసభ్యులు, బంధువులు వెళ్లి వెతికారు. తల్లి, బిడ్డ కాలిన స్థితిలో విగత జీవులుగా కనిపించారు. నత్తం పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి దర్యాప్తు చేపట్టారు. శివకుమార్‌ అన్న కరుప్పయ్య ఈ ఘాతుకానికి పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది. అతడిని అరెస్టు చేశారు. అంజలైని తన కోరిక తీర్చాలని పలుమార్లు అడిగినా అంగీకరించలేదని, ఓ సారి వేట కొడవలితో నరకాలని యత్నిస్తే తప్పించుకుందని నిందితుడు వాంగ్మూలంలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. తర్వాత వేరు కాపురం పెట్టడంతో తనకు మరింత ఆగ్రహం తెప్పించినట్లు చెప్పాడన్నారు. ఈ నేపథ్యంలో శనివారం మేకలను మేపడానికి అడవికి వెళ్లినపుడు కూడా తన కోరిక తీర్చమని అడిగితే అంగీకరించలేదని, దీంతో వేట కొడవలితో నరికానని, తర్వాత బిడ్డను కూడా నరికి మృతదేహాలకు నిప్పంటించినట్లు తెలిపాడని చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని