logo

Hyderabad News: మెట్రోస్టేషన్‌ పైనుంచి దూకి ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య

ఈఎస్‌ఐ మెట్రోస్టేషన్‌ పైనుంచి దూకి ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సార్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపారు. బోరబండ శ్రీరామ్‌నగర్‌ సమీపంలోని సంజయ్‌నగర్‌కు చెందిన విద్యార్థిని (22) ఎంబీఏ మొదటి

Updated : 06 Apr 2022 09:46 IST

అమీర్‌పేట, న్యూస్‌టుడే: ఈఎస్‌ఐ మెట్రోస్టేషన్‌ పైనుంచి దూకి ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సార్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపారు. బోరబండ శ్రీరామ్‌నగర్‌ సమీపంలోని సంజయ్‌నగర్‌కు చెందిన విద్యార్థిని (22) ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతుంది. తండ్రికి ఆటో మొబైల్‌ దుకాణం ఉంది. ఆయనకు ముగ్గురు కుమారులూ ఉన్నారు. కూతురు ఫోన్లో ఛాటింగ్‌ చేస్తుండగా తల్లిదండ్రులు మంగళవారం మందలించగా మనస్తాపానికి గురైన ఆమె సాయంత్రం 5.30 గంటలకు ఈఎస్‌ఐ మెట్రోస్టేషన్‌కు చేరుకుంది. స్టేషన్‌ మొదటి అంతస్తు పైనుంచి ఈఎస్‌ఐ ఆసుపత్రి వైపు కిందకు దూకింది. తీవ్రగాయాలైన ఆమెను 108లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.  

మెట్రో స్టేషన్లలో భద్రతా చర్యలు కట్టుదిట్టం

ఈఎస్‌ఐ మెట్రోస్టేషన్‌ పైనుంచి ఎంబీఏ విద్యార్థిని దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై మెట్రోరైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండటంతో ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ సంస్థ అధికారులతో చర్చిస్తామని పేర్కొన్నారు. మరోసారి ఇలాంటివి జరగకుండా మెట్రోస్టేషన్లలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోనున్నామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని