logo

Telangana News: వృద్ధురాలి పేరిట బ్యాంకు సిబ్బంది వ్యక్తిగత రుణం

: వృద్ధురాలి పేరిట బ్యాంకుకు చెందిన సిబ్బంది వ్యక్తిగత రుణం తీసుకుని మోసగించాడు. తుకారాంగేట్‌ ఠాణా డీఐ ఆంజనేయులు తెలిపిన కథనం ప్రకారం.. సఫీల్‌గూడ ప్రాంతానికి చెందిన అనసూర్య(80)కు ఈస్ట్‌మారేడుపల్లి ఎస్‌బీఐ శాఖలో 25 ఏళ్లుగా ఖాతా కొనసాగుతోంది.

Updated : 09 Apr 2022 09:16 IST

అడ్డగుట్ట, న్యూస్‌టుడే: వృద్ధురాలి పేరిట బ్యాంకుకు చెందిన సిబ్బంది వ్యక్తిగత రుణం తీసుకుని మోసగించాడు. తుకారాంగేట్‌ ఠాణా డీఐ ఆంజనేయులు తెలిపిన కథనం ప్రకారం.. సఫీల్‌గూడ ప్రాంతానికి చెందిన అనసూర్య(80)కు ఈస్ట్‌మారేడుపల్లి ఎస్‌బీఐ శాఖలో 25 ఏళ్లుగా ఖాతా కొనసాగుతోంది. ఆమె కొడుకు ఏఎస్‌రావునగర్‌, కుమార్తె కూకట్‌పల్లిలో ఉంటారు. వృద్ధురాలు ఒక్కతే వచ్చి విశ్రాంత ఉద్యోగి అయిన తన భర్త పింఛను డబ్బులు రూ.13వేలను తన ఖాతాలో జమ చేస్తుంటుంది. ఇందుకు బ్యాంకులోని వ్యక్తి డబ్బులు డ్రా చేయడం, తీయడం సహకరించేవాడు. బ్యాంకులో ఆమె పేరున ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు రూ.48.50 లక్షల వరకు ఉన్నాయి. వృద్ధురాలి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొన్న బ్యాంకులోని వ్యక్తి ఆమె ఖాతాకు తన ఫోను నంబరుకు అనుసంధానం చేసి వ్యక్తిగత రుణానికి దరఖాస్తు చేసుకుని డిపాజిట్‌లోంచి డబ్బు తీసుకొన్నాడు. వాయిదాలు చెల్లించకపోవడంతో వృద్ధురాలి ఫోన్‌కి సందేశాలు, ఫోన్లు వచ్చాయి. ఈ విషయాన్ని కుమారుడు, కూతురికి చెప్పగా..  మోసం విషయం బయటపడింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ వృద్ధురాలు గురువారం తుకారాంగేట్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడానికి రాగా పోలీసులు ఎంతకీ పట్టించుకోలేదు. తుకారాంగేట్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని