logo

Andhra News: వసతి గృహంలోని బాలికలకు ప్రేమ పేరుతో వల.. బట్టబయలైన సెక్స్‌ రాకెట్‌

మండల కేంద్రంలోని రాయలవారికోట గ్రామంలో యువకుడు గదిని అద్దెకు తీసుకుని బాలికలను ప్రేమ పేరుతో మభ్యపెట్టి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. రహస్యంగా అందిన సమాచారంతో గురువారం...

Updated : 09 Apr 2022 06:59 IST

చంద్రగిరి: మండల కేంద్రంలోని రాయలవారికోట గ్రామంలో యువకుడు గదిని అద్దెకు తీసుకుని బాలికలను ప్రేమ పేరుతో మభ్యపెట్టి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. రహస్యంగా అందిన సమాచారంతో గురువారం అర్ధరాత్రి పోలీసులు దాడిచేసి ఇద్దరు బాలికలు, ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకున్నారు. దీనికి ప్రధాన సూత్రధారుడైన యువసాయి(23) రెండస్తుల మిద్దెపై నుంచి దూకి పారిపోయాడు. గదిలో రెండు గోనె సంచుల్లో ఖాళీ మద్యం సీసాలు, గంజాయి పొట్లాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సెక్స్‌ రాకెట్‌ వెనుక ఎవరి ప్రమేయం ఉందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. పారిపోయిన యువకుడి కోసం గాలిస్తున్నారు. ఓ ప్రభుత్వ వసతిగృహంలోని బాలికలను ప్రేమ పేరుతో, వారి అవసరాల మేరకు నగదు అందిస్తూ లొంగదీసుకుని వ్యభిచారం చేస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ వ్యవహారంపై ఇప్పటివరకు రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. హాస్టల్‌ వార్డెన్‌తో పాటు పట్టుబడిన బాలబాలికలను పోలీసులు విచారించారన్నారు. తల్లిదండ్రుల రాతపూర్వక విన్నపం మేరకు బాలికలను పంపించినట్లు తెలిపారు. దీనికి ప్రధాన పాత్రదారులు, సూత్రదారులపై పూర్తి స్థాయిలో విచారించి కఠినమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని