logo

ఆశ్చర్యం.. ఆలయానికి పాడెపై వచ్చి మొక్కు చెల్లింపు

ఓ భక్తుడు శవంగా పాడెపై ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి కానుకలు చెల్లించి తన మొక్కు తీర్చిన ఘటన సేలంలో చోటుచేసుకుంది. సేలం జిల్లా జారికొండలాంపట్టి మారియమ్మన్‌ కాళియమ్మన్‌...

Updated : 10 Apr 2022 07:02 IST

సేలం, న్యూస్‌టుడే: ఓ భక్తుడు శవంగా పాడెపై ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి కానుకలు చెల్లించి తన మొక్కు తీర్చిన ఘటన సేలంలో చోటుచేసుకుంది. సేలం జిల్లా జారికొండలాంపట్టి మారియమ్మన్‌ కాళియమ్మన్‌ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ఓ భక్తుడు శవం వేషం ధరించి పాడెపై వచ్చాడు.S

ఇందుకుగాను కొండలాంపట్టిలోని బస్టాండ్‌లో పందిరి వేసి శవానికి చేసే అన్ని ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు అంత్యక్రియల్లో పాల్గొన్న మాదిరిగానే వ్యవహరించడం గమనార్హం. అనంతరం పాడెపై అతన్ని ఊరేగింపుగా శ్మశానికి తీసుకెళ్లి వెంట తీసుకొచ్చిన కోడిని మాత్రమే పూడ్చిపెట్టారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని