logo

vidadala Rajini: ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యశాఖ మంత్రి తెలంగాణ బిడ్డ

ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన విడదల రజని మన తెలంగాణ బిడ్డే. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం...

Updated : 13 Apr 2022 10:17 IST

యాదాద్రిభువనగిరి జిల్లా కొండాపురం స్వగ్రామం

తుర్కపల్లి, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన విడదల రజని మన తెలంగాణ బిడ్డే. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామానికి చెందిన రాగుల సత్తయ్య రెండో కూతురు రజని మంత్రి కావటంపై ఆ గ్రామంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సత్తయ్య బతుకుదెరువు నిమిత్తం 40 ఏళ్ల కిందట హైదరాబాద్‌కు వలస వెళ్లారు. సఫిల్‌గూడలో నివాసం ఉంటున్నారు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. రెండో కూతురు రజని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పారిశ్రామికవేత్తతో వివాహమైంది. ఆమె పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య మంత్రిగా చోటు దక్కించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని