logo

Hyd News: మృత్యుంజయుడీ చిన్నారి.. ఒమన్‌ నుంచి హైదరాబాద్‌కు..

పుట్టుకతోనే అన్నవాహిక సక్రమంగా అభివృద్ధి చెందని ఒమన్‌ దేశానికి చెందిన రెండేళ్ల చిన్నారికి హైదరాబాద్‌లోని రెయిన్‌బో చిన్న పిల్లల ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి పునర్జన్మ ప్రసాదించారు. బుధవారం

Updated : 14 Apr 2022 07:40 IST

వాఫీ

ఈనాడు, హైదరాబాద్‌: పుట్టుకతోనే అన్నవాహిక సక్రమంగా అభివృద్ధి చెందని ఒమన్‌ దేశానికి చెందిన రెండేళ్ల చిన్నారికి హైదరాబాద్‌లోని రెయిన్‌బో చిన్న పిల్లల ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి పునర్జన్మ ప్రసాదించారు. బుధవారం ఆసుపత్రి వైద్యులు మైనక్‌ దేబ్‌, డాక్టర్‌ హరీష్‌ జయరాం వివరాలను మీడియాకు వెల్లడించారు. ఒమన్‌కు చెందిన బాలుడు వాఫీకి పుట్టుకతోనే అన్నవాహిక సక్రమంగా అభివృద్ధి చెందలేదు. ఈ స్థితిని ‘ఈసోఫాగెల్‌ అట్రీసియా, ట్రాచియో-ఈసోఫాగెల్‌ ఫిస్టులా(ఈఏ/టీఈఎఫ్‌) సమస్యగా వ్యవహరిస్తారు. 5 వేల మంది శిశువుల్లో ఒకరికి ఈ సమస్య వస్తుంది. దీనివల్ల పిల్లలు నోటితో ఆహారాన్ని సక్రమంగా తీసుకోలేరు.  ఈ బాలుడికీ ఒమన్‌లో పలు శస్త్రచికిత్సలు చేసినప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. ఒమన్‌ నుంచి చిన్నారిని వారి తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని రెయిన్‌బోకు ఫిబ్రవరి 2వ తేదీన తరలించారు.  మార్చి 1న బాలుడికి శస్త్రచికిత్స చేసి అన్నవాహికను విజయవంతంగా పునరుద్ధరించారు. అనంతరం 23 రోజులపాటు పిడియాట్రిక్‌ ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందించామన్నారు. కుమారుడి ప్రాణాలు కాపాడిన వైద్యులకు చిన్నారి వాఫీ తండ్రి ముసల్లమ్‌ అలీ కత్రి కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు