logo

MK Stalin: మాటల్లో కాక, చేతల్లో చూపిద్దామని..! : స్టాలిన్‌

మాటలు తగ్గించి చేతల్లో చూపిద్దామని నిర్ణయించుకుని పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. ఆహా ఓటీటీ తమిళ వెర్షన్‌ ప్రారంభ కార్యక్రమం చెన్నైలోని ఓ నక్షత్ర హోటల్‌లో గురువారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్‌ ముఖ్య అ

Updated : 15 Apr 2022 08:44 IST


ఓటీటీని ప్రారంభిస్తున్న స్టాలిన్‌. చిత్రంలో అల్లు అరవింద్, భారతిరాజా, ఉదయనిధి తదితరులు

కోడంబాక్కం, న్యూస్‌టుడే: మాటలు తగ్గించి చేతల్లో చూపిద్దామని నిర్ణయించుకుని పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. ఆహా ఓటీటీ తమిళ వెర్షన్‌ ప్రారంభ కార్యక్రమం చెన్నైలోని ఓ నక్షత్ర హోటల్‌లో గురువారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘ఈ ఓటీటీ ప్రారంభ కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా నన్ను ఆహ్వానించారు. తమిళం కోసం అయితే నేను ఏ సమయంలోనైనా వచ్చేందుకు సిద్ధంగానే ఉన్నా. ఈ ఓటీటీ పేరు కూడా ఆహా అని ఉంది. చాలా సంతోషంగా ఉన్నప్పుడు ‘ఆహా’ అంటారని అందరికీ తెలుసు. సమాజానికి ఉపయోగపడేవిధంగా ఈ ఆహా పనిచేయాలని కోరుకుంటున్నా. అందరికీ ‘సిత్తిరై తిరునాళ్‌’ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్, నిర్మాత అల్లు అరవింద్, సీనియర్‌ దర్శకుడు భారతిరాజా తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని