logo

Andhra News: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం భూమి కబ్జా!

అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం భూమి కబ్జాకు గురైంది. ఇటీవల గన్నవరం పట్టణ శివారులోని మదర్‌థెరిసా కాలనీలో కొలువైన పెద్దమ్మతల్లి ఆలయ..

Updated : 16 Apr 2022 10:36 IST

 ఆక్రమణలపై కొరవడిన పర్యవేక్షణ

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం భూమి కబ్జాకు గురైంది. ఇటీవల గన్నవరం పట్టణ శివారులోని మదర్‌థెరిసా కాలనీలో కొలువైన పెద్దమ్మతల్లి ఆలయ నిర్వాహకుడు చిక్కవరపు రామారావు ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు కొందరు పంచాయతీ, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కాలనీని శుక్రవారం సందర్శించిన పంచాయతీ, రెవెన్యూ అధికారుల బృందం.. సదరు స్థలం విమానాశ్రయానిదేనని తేల్చారు. విమానాశ్రయానికి చెందిన సుమారు 87 సెంట్ల స్థలాన్ని ఆలయ నిర్వాహకుడు ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా తొమ్మిది భాగాలుగా భారీ భవన సముదాయాన్ని నిర్మించాడు. ప్రభుత్వం, విమానాశ్రయ అధికారుల పర్యవేక్షణ కొరవడడం కారణంగానే ఇటువంటి దుస్థితి నెలకొందని ఫిర్యాదుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరం పరిసరాల్లో భూకబ్జాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్న తరుణంలో క్షేత్ర స్థాయి సిబ్బంది కదలికలపై ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా ఉంచాలని డిమాండ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవన సముదాయాన్ని కూల్చివేసి.. కబ్జాదారుడికి సహకరించిన వారిపై చర్యలు చేపట్టాలని ఫిర్యాదుదారులు తెలిపారు. ఇంత జరుగుతున్నా విమానాశ్రయ అధికారులు తమ ఆధీనంలో ఉన్న భూమి వైపు కన్నెత్తి చూడక పోవడం గమనార్హం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని