logo

Crime News: మిమ్మల్ని చూడ్డానికే వచ్చానని టోకరా

‘కేవలం మిమ్మల్ని చూడడానికే ఇండియాకు వచ్చాను. విమానాశ్రయంలో పోలీసులు పట్టుకున్నారు.. తనను విడిపించాల’ని రూ.5.85 లక్షలు కొట్టేశారంటూ ఓ బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు

Published : 19 Apr 2022 07:44 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: ‘కేవలం మిమ్మల్ని చూడడానికే ఇండియాకు వచ్చాను. విమానాశ్రయంలో పోలీసులు పట్టుకున్నారు.. తనను విడిపించాల’ని రూ.5.85 లక్షలు కొట్టేశారంటూ ఓ బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌కు చెందిన ఓ యువతికి ఫేస్‌బుక్‌ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. యూకేలో పెద్ద వ్యాపారం చేస్తున్నానని, మీరు నచ్చారని చెప్పాడు. బాధితురాలు తిరస్కరించినా వదలకుండా సామాజిక మాధ్యమంలో వెంటపడ్డాడు. మిమ్మల్ని చూడటానికి ఇండియాకు వస్తున్నానని చెప్పాడు. రెండు రోజుల తరువాత విమానాశ్రయం నుంచి కస్టమ్స్‌ అధికారుల పేరుతో ఫోన్‌ చేశారు. ఓ వ్యక్తి చట్టవిరుద్ధంగా పెద్దమొత్తంలో విదేశీ కరెన్సీ తీసుకొచ్చాడు. దానికి ఎలాంటి పన్ను చెల్లించలేదు. ఎవరైనా తెలుసా అంటే మీ నంబరు ఇచ్చాడని చెప్పారు. ఆయన్ని వదలాలంటే కొంత డబ్బు కట్టాలని చెప్పి, విడతలవారిగా బాధితురాలి నుంచి రూ.5.85 లక్షలు కొట్టేశారు. తర్వాత ఆ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ కావడంతో బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని