logo

Crime News: సొంత యాప్‌తో క్రికెట్‌ మ్యాచ్‌ ప్రసారం.. నిందితుడి అరెస్టు

చందా కట్టకుండా.. సెటప్‌ బాక్స్‌ అవసరం లేకుండా సొంత యాప్‌ ద్వారా టీ20 మెగా టోర్నీ క్రికెట్‌ మ్యాచ్‌ను ప్రసారం చేస్తున్న యువకుడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెన్నైలో అరెస్టు చేసి నగరానికి

Updated : 21 Apr 2022 07:16 IST

నగరానికి తీసుకొచ్చిన సైబర్‌ పోలీసులు

నారాయణగూడ, న్యూస్‌టుడే: చందా కట్టకుండా.. సెటప్‌ బాక్స్‌ అవసరం లేకుండా సొంత యాప్‌ ద్వారా టీ20 మెగా టోర్నీ క్రికెట్‌ మ్యాచ్‌ను ప్రసారం చేస్తున్న యువకుడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెన్నైలో అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. బంజారాహిల్స్‌కు చెందిన స్టార్‌ ఇండియా ప్రతినిధి కదరామ్‌ తుప్పా గుర్తు తెలియని వ్యక్తులు తమ లింక్‌ను తస్కరించి, ఓ యాప్‌ ద్వారా క్రికెట్‌ మ్యాచ్‌ను ప్రసారం చేస్తున్నారని ఇటీవల హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. సాంకేతిక ఆధారాలతో ఈ యాప్‌ తమిళనాడు రాష్ట్రం శివగంగై జిల్లా నుంచి నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసు బృందం తమిళనాడు శివగంగై సమీపంలోని కాంజిరంగల్‌లోని పిల్లైయార్‌ కోయిల్‌ వీధిలో నివాసముండే రామమూర్తి(29) దీనికి సూత్రధారిగా గుర్తించి అరెస్టు చేశారు. అక్కడి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టి బుధవారం నగరానికి తీసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని