logo

Andhra News: ఆస్ట్రేలియాలో ఎమ్మెల్సీగా తెలుగు విద్యార్థి

ఆస్ట్రేలియా రాజకీయాల్లో తెలుగు విద్యార్థికి అరుదైన గౌరవం దక్కింది. నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన దివి తనూజ్‌ చౌదరి(15) ఆస్ట్రేలియా దేశంలో యువత విభాగంలో ఎమ్మెల్సీ పదవికి ఎంపికయ్యారు. కందుకూరుకు చెందిన దివి రామకృష్ణ, టంగుటూరుకు చెందిన పమిడి

Updated : 23 Apr 2022 07:48 IST

టంగుటూరు, కందుకూరు, న్యూస్‌టుడే: ఆస్ట్రేలియా రాజకీయాల్లో తెలుగు విద్యార్థికి అరుదైన గౌరవం దక్కింది. నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన దివి తనూజ్‌ చౌదరి(15) ఆస్ట్రేలియా దేశంలో యువత విభాగంలో ఎమ్మెల్సీ పదవికి ఎంపికయ్యారు. కందుకూరుకు చెందిన దివి రామకృష్ణ, టంగుటూరుకు చెందిన పమిడి ప్రత్యూషను వివాహం చేసుకొని పది సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం వెళ్లారు. రామకృష్ణ సాఫ్ట్‌వేర్‌ కొలువులో స్థిరపడ్డారు. వారి కుమారుడు తనూజ్‌ చౌదరి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ప్లస్‌ వన్‌ చదువుతున్నాడు. పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆ బాలుడి ఆసక్తిని గుర్తించి రెండు వారాల క్రితం ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేశారని, శుక్రవారం ఉదయం అసెంబ్లీకి తీసుకెళ్లినట్లు రామకృష్ణ కందుకూరులో నివసిస్తున్న బాలుడి నానమ్మ వరలక్ష్మికి తెలిపారు. అంతేకాక మంత్రిగా సైతం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని