logo

Road Accident: అమెరికాలో కారు ప్రమాదంలో హైదరాబాద్‌ విద్యార్థి దుర్మరణం

ఉన్నత చదువులకు అమెరికా వెళ్లిన నాలుగు నెలలకే ఓ విద్యార్థి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. మిత్రులతో కలిసి షాపింగ్‌కు వెళ్లి కారులో తిరిగొస్తున్న వారిని మరో కారు

Updated : 24 Apr 2022 11:31 IST

వంశీకృష్ణ

నిజాంపేట, న్యూస్‌టుడే: ఉన్నత చదువులకు అమెరికా వెళ్లిన నాలుగు నెలలకే ఓ విద్యార్థి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. మిత్రులతో కలిసి షాపింగ్‌కు వెళ్లి కారులో తిరిగొస్తున్న వారిని మరో కారు ఢీకొట్టడంతో హైదరాబాద్‌కు చెందిన ఎం.ఎస్‌.విద్యార్థి పీచెట్టి వంశీకృష్ణ(23) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఖమ్మం నివాసి పవన్‌(23) సైతం మృతి చెందగా మరో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నిజాంపేటలోని రెడ్డీస్‌ ఎవెన్యూ కాలనీలో నివసించే ప్రైవేటు బ్యాంకు మేనేజర్‌ వరప్రసాద్‌, జేఎన్‌టీయూ ఫ్రొఫెసర్‌ డాక్టర్‌ పద్మజారాణి దంపతుల పెద్ద కుమారుడు శశికిరణ్‌ ఏడేళ్ల కిందట ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. చిన్న కుమారుడు వంశీకృష్ణ గతేడాది బీటెక్‌ పూర్తిచేసి, గత డిసెంబరు 28న యూఎస్‌ వెళ్లారు. అక్కడి సదరన్‌ ఇల్లినాయిస్‌ వర్సిటీలో ఎంఎస్‌ చేస్తున్నారు. గురువారం తెల్లవారుజామున(భారత కాలమాన ప్రకారం ఈనెల 22న సాయంత్రం 4.30 గంటలు) 10 మంది విద్యార్థులు రెండు వేర్వేరు కార్లలో షాపింగ్‌కు వెళ్లారు. తిరిగొస్తుండగా చికాగో రోడ్డులో మరో కారులో వచ్చిన ఓ మహిళ వీరి కారును బలంగా ఢీకొట్టింది. కారు నడుపుతున్న పవన్‌, వెనక కూర్చున్న వంశీకృష్ణ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కల్యాణ్‌, కార్తిక్‌, శ్రీకాంత్‌ గాయపడ్డారు. ఇందులో కల్యాణ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని