logo

Telangana News: 12 ఏళ్లకే పుస్తకం రాసిన విద్యార్థిని

చిత్రంలోని బాలిక పేరు ఇసబెల్లా. వయసు 12. నగరంలోని మెరీడియన్‌ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ‘ప్రిన్సెస్‌ చిన్ని గోస్‌ టు స్కూల్‌’’ పేరుతో బాలిక రాసిన పుస్తకం అందరినీ ఆలోచింపజేస్తోంది.

Updated : 27 Apr 2022 09:16 IST

 

చిత్రంలోని బాలిక పేరు ఇసబెల్లా. వయసు 12. నగరంలోని మెరీడియన్‌ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ‘ప్రిన్సెస్‌ చిన్ని గోస్‌ టు స్కూల్‌’’ పేరుతో బాలిక రాసిన పుస్తకం అందరినీ ఆలోచింపజేస్తోంది.

ఈనాడు, హైదరాబాద్‌

ఆమె తండ్రి దీపేశ్‌దీపు ఇక్ఫాయ్‌ విశ్వవిద్యాలయంలో మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌, తల్లి సుప్రియ ఆక్యుపంక్చర్‌ వైద్యురాలు. లైబ్రరీలకు తీసుకెళ్లడం, పుస్తకాలు తీసుకురావడం తదితరాలతో చిన్నప్పటినుంచే చిన్నారికి పుస్తక పఠనంపై ఆసక్తి పెంచారు. తర్వాత రాయడంపై ఆసక్తి కలిగింది. ఏడేళ్ల వయసులో కంపోస్టింగ్‌ విధానంపై రచించిన కవితను నెక్లెస్‌ రోడ్డులో జరిగిన ఉద్యానవన మేళాలో ప్రదర్శించారు.

* బాలిక గతంలో రాసిన కథ ఓషియన్‌ బ్లూ పేరిట ప్రచురితమైన కథల సంకలనంలో అచ్చయింది. రెండేళ్ల కిందట ఈ పుస్తకం మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది.


నా పుస్తకానికి చుట్టుపక్కల జరిగిన సంఘటనలే ఆధారం. అమ్మతో కలిసి బస్తీలకు వెళ్లినప్పుడు అక్కడ గమనించిన పరిస్థితులను అక్షరబద్ధం చేశాను. కష్టపడితే లక్ష్యాలు చేరుకోవచ్చు అని సూచించాను. మున్ముందు రచనలు కొనసాగించాలనుకుంటున్నా.


వాస్తవానికి ఈ పుస్తకం 9ఏళ్ల వయసులోనే రాసినా.. ముద్రణకు దాదాపు మూడేళ్లు పట్టింది. ప్రచురణకర్తలు ముందుకు రాకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎట్టకేలకు ఓ పబ్లిషర్స్‌ ముందుకు రావడంతో కల నెరవేరింది. చిన్ని అనే చిన్నారి కోణంలో చిరు కథల రూపంలో వివరిస్తూ.. ఎంతో సరళమైన భాషలో రచన సాగింది.


బాలిక నగరంలోని చింతల్‌బస్తీ, మరో రెండు బస్తీలు తిరిగి ప్రజల జీవన విధానం, పిల్లల పరిస్థితులు తెలుసుకుంది. ప్రతి చిన్నారికి చదువుకునే హక్కు, ఆరోగ్యకర జీవితం ఉండాలని భావించింది. నైతిక, సామాజిక విలువలు చెబుతూనే పర్యావరణ పరిరక్షణ, లింగ సమానత్వం, కష్టపడే తత్వం, సుస్థిరాభివృద్ధి, సాంకేతికత.. ఇలా వివిధ అంశాలను బస్తీ జీవితాలతో ముడిపెట్టి ‘ప్రిన్సెస్‌ చిన్ని గోస్‌ టు స్కూల్‌’’ పేరిట పుస్తకాన్ని రాసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని