logo

Hyd News: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ గగనతలంలో డ్రోన్‌ చక్కర్లు.. హై అలర్ట్‌

శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిషిద్ధ గగనతలం  ఉత్తర దిశలో బుధవారం డ్రోన్‌ చక్కర్లు కొట్టింది. విమానాశ్రయం అధికారులు తెలిపిన కథనం ప్రకారం.. మామిడిపల్లి వైపు నుంచి మంగళవారం

Published : 28 Apr 2022 10:10 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిషిద్ధ గగనతలం  ఉత్తర దిశలో బుధవారం డ్రోన్‌ చక్కర్లు కొట్టింది. విమానాశ్రయం అధికారులు తెలిపిన కథనం ప్రకారం.. మామిడిపల్లి వైపు నుంచి మంగళవారం రాత్రి 11 గంటలకు పైకెగిరిన డ్రోన్‌ సీఐఎస్‌ఎఫ్‌ గృహ సముదాయాలు, జీఎమ్మార్‌ చిన్మయ పాఠశాల, ధర్మగిరి దేవాలయం పరిసరాల్లో నాలుగు గంటల పాటు చక్కర్లు కొట్టింది. శంషాబాద్‌లో ల్యాండింగ్‌ కావాల్సిన విమానాలకు ఏటీసీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాకుంటే ఈ ప్రాంతంలో తక్కువ ఎత్తులో తిరుగుతుంటాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో విమానాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇక్కడ డ్రోన్లు ఎగురవేయడాన్ని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ అధికారులు నిషేధించారు. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్‌ విమానాశ్రయం గగనతలంలోకి రావడంతో  భద్రతాధికారులు విమానాశ్రయంలో  హైఅలర్ట్‌ ప్రకటించారు. సైబరాబాద్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని