logo

Telangana News: ఆస్తిపన్నుపై రాయితీకి నేడే ఆఖరు

ఆస్తిపన్నుపై 5శాతం రాయితీ పొందే ఎర్లీబర్డ్‌ పథకం నేటితో ముగియనుందని జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి శుక్రవారం రాత్రి వరకు రూ.640 కోట్ల పన్ను

Published : 30 Apr 2022 08:11 IST

రూ.640 కోట్లు వసూలు చేసిన జీహెచ్‌ఎంసీ

ఈనాడు, హైదరాబాద్‌: ఆస్తిపన్నుపై 5శాతం రాయితీ పొందే ఎర్లీబర్డ్‌ పథకం నేటితో ముగియనుందని జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి శుక్రవారం రాత్రి వరకు రూ.640 కోట్ల పన్ను వసూలైంది. 66వేల మంది అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. మిగిలిన వారూ పూర్తి పన్ను చెల్లించి రాయితీ పొందొచ్చని, శనివారం అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్‌లో పన్ను చెల్లించవచ్చని జీహెచ్‌ఎంసీ సూచించింది. ప్రజల సౌకర్యార్థం జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లోని పౌర సేవా కేంద్రాలు రాత్రి 10గంటల వరకు కొనసాగనున్నాయి. ఖజానాకు చేరిన పన్నులో డిజిటల్‌ చెల్లింపులది అగ్రస్థానం. శుక్రవారం చాలామందికి సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఈ పథకం మొదలైనప్పట్నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ పన్ను వసూలవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని