logo

Tamil Nadu: సముద్రం నీటిని పీల్చిన మేఘాలు.. సోషల్‌ మీడియాలో వైరల్‌

కన్యాకుమారి సమీపంలో సముద్రపు నీటిని మేఘాలు పీల్చుతున్న దృశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రాష్ట్రంలో నెలకొంటున్న వాతావరణ మార్పుల కారణంగా కన్యాకుమారి జిల్లాలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణం కేంద్ర తెలిపింది. ఆమేరకు జిల్లాలో అక్కడక్కడా జల్లులు పడుతున్నాయి

Updated : 02 May 2022 09:16 IST

మేఘాలు సముద్రపు నీటిని లాక్కుంటున్న దృశ్యం

వేలచ్చేరి, న్యూస్‌టుడే: కన్యాకుమారి సమీపంలో సముద్రపు నీటిని మేఘాలు పీల్చుతున్న దృశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రాష్ట్రంలో నెలకొంటున్న వాతావరణ మార్పుల కారణంగా కన్యాకుమారి జిల్లాలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణం కేంద్ర తెలిపింది. ఆమేరకు జిల్లాలో అక్కడక్కడా జల్లులు పడుతున్నాయి. కన్యాకుమారి సమీపంలోని తూత్తూర్‌లో శనివారం సాయంత్రం నుంచి సముద్రం కల్లోలంగా కనిపించింది. ఈనేపథ్యంలో తీరంలో ఉన్న జాలర్లు తూత్తూర్‌ సముద్రంలో నెలకొంటున్న పరిస్థితులను గమనిస్తున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సుమారు 30 నిముషాలపాటు మేఘాలు సముద్రపు నీటిని పీల్చుతున్న దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని