logo

తండ్రి కాదు కసాయి.. కుమార్తె, ఇద్దరు కుమారులను హతమార్చిన రాక్షసుడు!

రాతి గుండెలను సైతం కన్నీళ్లు పెట్టించే ఈ ఘటన ఒడిశాలోని సుందర్‌గఢ్‌ జిల్లాలోని కొయిడా సమితిలోని కొలాగాన్‌ ముండా సాయి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పండా ముండాకు భార్య దోబీ ముండా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సారాకు బానిసైన ముండా తాగొచ్చి ప్రతి రోజు భార్యతో గొడవ పడేవాడు.

Updated : 02 May 2022 08:59 IST

చిన్నారుల మృతదేహాలు

సారా.. చక్కటి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. తాగిన మత్తులో కన్న తండ్రి కసాయిగా మారాడు. ముక్కు పచ్చలారని పిల్లల పట్ల కర్కశంగా వ్యవహరించాడు. గాఢ నిద్రలో ఉన్న కుమార్తె, ఇద్దరు కుమారులను బావిలోకి తోసి చంపేశాడు. ముగ్గురిలో ఒకరు మూడు నెలల పసికందు.

రాతి గుండెలను సైతం కన్నీళ్లు పెట్టించే ఈ ఘటన ఒడిశాలోని సుందర్‌గఢ్‌ జిల్లాలోని కొయిడా సమితిలోని కొలాగాన్‌ ముండా సాయి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పండా ముండాకు భార్య దోబీ ముండా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సారాకు బానిసైన ముండా తాగొచ్చి ప్రతి రోజు భార్యతో గొడవ పడేవాడు. శనివారం రాత్రి యధావిధిగా తాగొచ్చిన ముండాను భార్య ప్రశ్నించడంతో ఆమెపై చేయిచేసుకున్నాడు. గొడ్డలితో దాడి చేసేందుకు ప్రయత్నించగా దోబీ తప్పించుకుంది. దాంతో నిద్ర పోతున్న పిల్లలు సిమా ముండా(5), కుమారుడు రాజు ముండా(2), ముడు నెలల మగశిశువును తీసుకెళ్లి ఇంటి వెనక ఉన్న బావిలో పడేసి పరారయ్యాడు. పొరుగింట్లో రాత్రంతా తలదాచుకున్న దోబీ ముండా ఉదయం ఇంటికి వచ్చి చూడగా పిల్లలు కనిపించలేదు. చుట్టుపక్కల గాలిస్తున్న క్రమంలో బావిలో చిన్నారుల మృతదేహాలు కనిపించాయి. విషయం గ్రామస్థులకు, పోలీసులకు తెలియజేసింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని బావిలో మృతదేహాలను వెలికి తీశారు. నిర్జీవంగా పడి ఉన్న కన్నబిడ్డలను చూసిన తల్లి దోబీ గుండెలవిసేలా రోదించింది. సంఘటన స్థలంలో గుమిగూడిన ఇరుగుపొరుగు సైతం పసిబిడ్డల మృతదేహాలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.

గుండెలవిసేలా రోదిస్తున్న తల్లి దోబీ ముండా

మృతదేహాలను వెలికి తీసేందుకు బావిలోకి దిగుతున్న అగ్నిమాపకశాఖ ఉద్యోగి

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని