logo

Cyber Crime: పెళ్లికి దాచుకున్నదంతా.. దోచుకున్నారు

అమెరికాలో ఉద్యోగం అనగానే తన పెళ్లి కోసం దాచుకున్న రూ.10 లక్షలను సైబర్‌ కేటుగాళ్లకు ముట్టజెప్పారు ఓ బాధితురాలు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ తెలిపిన వివరాల....

Published : 03 May 2022 09:38 IST

నారాయణగూడ: అమెరికాలో ఉద్యోగం అనగానే తన పెళ్లి కోసం దాచుకున్న రూ.10 లక్షలను సైబర్‌ కేటుగాళ్లకు ముట్టజెప్పారు ఓ బాధితురాలు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌ లాలాగూడకు చెందిన యువతి అమెరికాలో ఉద్యోగం కోసం అన్వేషణలో ఉన్నారు. అమెరికాలో ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో మేనేజర్‌ పోస్టు ఖాళీగా ఉందని నెలకు లక్షల్లో జీతం, హెచ్‌1బీ వీసా కూడా ఇప్పిస్తామని మెయిల్‌ వచ్చింది. బాధితురాలు స్పందించడంతో మరుసటి రోజే అమెరికాకు చెందిన వేర్వేరు ఫోన్‌ నంబర్లతో వాట్సాప్‌ కాల్‌ చేశారు. ప్రాసెసింగ్‌ ఫీజు కింద రూ.45 వేలు, వీసా కోసం, ఇన్సూరెన్స్‌కు, వర్క్‌ పర్మిట్‌కు, ఇలా మొత్తం రూ.10 లక్షలు దండుకున్నాడు. ఇంకా డబ్బులు కోరడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘మా అమ్మ చనిపోయే ముందు నా పెళ్లి కోసం దాచిన బంగారాన్నంతా అమ్మేసి ఇచ్చిన డబ్బని బాధితురాలు చెప్పడం కొస మెరుపు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని