logo

Hyd News: కబలిస్తున్న క్యాన్సర్‌.. దాతల చేయూత కోసం ఎదురుచూపులు

భార్యను దక్కించుకోవాలని తపిస్తున్న భర్త.. తల్లి ఆరోగ్య పరిస్థితిని నయం చేసుకోవాలనుకుంటున్న కూతుళ్లు.. విధిరాతకు ఎదురీదుతోంది ఆ కుటుంబం. కంటోన్మెంట్‌ ప

Updated : 08 May 2022 08:04 IST

కుటుంబ సభ్యులతో లావణ్య

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: భార్యను దక్కించుకోవాలని తపిస్తున్న భర్త.. తల్లి ఆరోగ్య పరిస్థితిని నయం చేసుకోవాలనుకుంటున్న కూతుళ్లు.. విధిరాతకు ఎదురీదుతోంది ఆ కుటుంబం. కంటోన్మెంట్‌ పరిధి న్యూబోయిన్‌పల్లి లక్ష్మినగర్‌బస్తీకి చెందిన సుధాకర్‌ ప్రైవేటు ఉద్యోగి. ఆయనకు భార్య లావణ్య, కుమార్తెలు వైష్ణవి, మహేశ్వరి, శ్రావణి, రేవతి ఉన్నారు. లావణ్య టైలరింగ్‌ చేసుకుంటూ భర్తకు చేదోడువాదోడుగా ఉండేది. తరువాత ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. చివరకు క్యాన్సర్‌ ఉన్నట్లు తేలింది.

పెద్దకుమార్తె నగలు కుదవపెట్టి.. లావణ్యకు కీమోథెరపీ, రేడియేషన్‌ చేయించాలని వైద్యులు సూచించారు. వివాహమైన పెద్దకుమార్తె నగలను కుదవపెట్టి రూ.3లక్షలు సమకూర్చుకున్నారు. తరువాత కుటుంబ సభ్యులు మరో రూ.9లక్షలు అప్పుచేసి శస్త్ర చికిత్స చేయించారు. దీంతో ఆ కుటుంబం పూర్తిగా అప్పుల ఊబీలో కూరుకుపోయింది. ఈ సమయంలోనే కొవిడ్‌ రూపంలో ఆ కుటుంబంపై మరో పిడుగు పడింది. సుధాకర్‌ ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. శస్త్రచికిత్సతో అంతా సాఫీగా సాగిపోతుందని అనుకునేలోపు లావణ్యకు మరోమారు పరీక్షలు నిర్వహించిన వైద్యులు రూ.12లక్షల ఖర్చుతో కూడుకున్న ఇమ్యూనోథెరపీ చేయాలని సూచించారు. ఈ క్రమంలోనే అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి సుధాకర్‌ స్థానికంగా ఉన్న తన ఇంటిని విక్రయించాడు. అయినా అప్పులు పూర్తిగా తీరలేదు. ఇంత చేసినా లావణ్య ఆరోగ్య పరిస్థితి పూర్తిగా కుదటపడకపోవడం, ఇమ్యూనోథెరపీకి రూ.12లక్షలు కావాల్సిరావడం, ఆర్థికస్థితి సరిగాలేక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో సుధాకర్‌ కుటుంబం దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది. దాతలు 9704442724లో ఈనాడు ప్రతినిధిని సంప్రదించి సాయం చేయవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని