logo

Andhra News: ఆ విలేకరులొస్తే.. తిట్టి పంపించమన్నారు: మంత్రి అంబటి

వారొస్తే తిట్టి పంపించమని.. పై నుంచి చెప్పారని రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు విలేకరులతో వ్యాఖ్యానించారు. ఆదివారం సాయంత్రం వైకాపా కార్యాలయంలో...

Updated : 09 May 2022 06:52 IST

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: ఈనాడు.. ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌, టీవీ5 విలేకర్లు వచ్చారా? వారొస్తే తిట్టి పంపించమని.. పై నుంచి చెప్పారని రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు విలేకరులతో వ్యాఖ్యానించారు. ఆదివారం సాయంత్రం వైకాపా కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం ఉందని సమాచారం ఇవ్వడంతో కొందరు ప్రింట్‌, టీవీ ఛానళ్ల విలేకరులు వెళ్లారు. అక్కడికి వెళ్లాక నియోజకవర్గ వైకాపా నాయకులతోనే సమావేశం ముగించారు. కార్యాలయంలో తన ఛాంబర్‌లో ఉన్న మంత్రి రాంబాబు సమావేశం ముగిసిన తర్వాత విలేకరులను పిలిచి, మాట్లాడారు. తన పనితీరు ఎలా ఉందో చెప్పాలంటూ ఆరా తీశారు. పోలవరం ప్రాజెక్టులో కొండపోరంబోకు భూముల పరిహారాన్ని అధికారులు బినామీ పేర్లతో పక్కదారి పట్టించడంపై ‘ఈనాడు’లో వచ్చిన కథనంపై విచారణ చేయిస్తామని, కాకుంటే ఇది ‘ఆఫ్‌ ది రికార్డు’ అని తెలిపారు. తమ పార్టీ వ్యతిరేక మీడియావారు ఎవరైనా వచ్చారా అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర పేర్లతో ఆరా తీశారు. సమాచారం లేక రాలేదని కొందరు విలేకరులు చెప్పగా, ఏం లేదు.. వస్తే తిట్టి పంపుదామని అని అంబటి వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని