logo

Telangana News: క్యాబ్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం.. మూడున్నరేళ్ల చిన్నారి మృతి

క్యాబ్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ఓ చిన్నారికి నిండు నూరేళ్లు నిండాయి. అప్పటి వరకు తమతోనే ఆడుకున్న కుమార్తె చనిపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.

Updated : 10 May 2022 06:57 IST


సిరి

నాచారం, న్యూస్‌టుడే: క్యాబ్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ఓ చిన్నారికి నిండు నూరేళ్లు నిండాయి. అప్పటి వరకు తమతోనే ఆడుకున్న కుమార్తె చనిపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. నాచారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా, మద్దూరు మండలం, బెక్కల్‌ గ్రామానికి చెందిన యాటాల కరుణాకర్‌-రవళి దంపతులకు కొడుకు రిషి, కుమార్తె సిరి(మూడున్నరేళ్లు) సంతానం. గతేడాది వలస వచ్చి నాచారం అన్నపూర్ణకాలనీలోని వంగా నిలయంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. సోమవారం సాయంత్రం సిరి ఆడుకునేందుకు ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో మల్కాజిగిరి, విష్ణుపురి కాలనీకి చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ రాజీవన్‌కుమార్‌ కారును అన్నపూర్ణ కాలనీకి వినియోగదారుణ్ని ఎక్కించుకొనేందుకు వచ్చాడు. యువతి ఎక్కగానే వెనక్కి రావడంతో రోడ్డు మీద ఆడుకుంటున్న సిరిపై నుంచి కారు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్‌ను స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈమేరకు కేసు నమోదు చేశారు. పేదరికం వల్లే నగరానికి వచ్చామని, అక్కడే ఉంటే కుమార్తె బతికేదని తల్లిదండ్రులు బోరున విలపించారు.


యువతి క్యాబ్‌లో ఎక్కుతుండగా వెనుక నుంచి వస్తున్న బాలిక

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని