logo

Andhra News: ‘సముద్రంలో కొట్టుకొచ్చిన ఆ మందిరం మయన్మార్‌ దేశానిది’

సంతబొమ్మాళి మండలంలోని ఎం.సున్నాపల్లి సముద్రం ఒడ్డుకు తుపాను ప్రభావంతో మంగళవారం కొట్టుకొచ్చిన మందిరాన్ని పోలి ఉన్న రథం మయన్మార్‌ దేశానికి చెందిందని అధికారులు గుర్తించారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ ఆదేశాల మేరకు తహసీీల్దార్‌ చలమయ్య, మెరైన్‌ సీీఐ దేవుళ్లు, నౌపడ ఎస్‌.ఐ.సాయికుమార్‌లు వెళ్లి పరిశీలించారు.

Updated : 12 May 2022 12:40 IST

మందిరం వద్ద తహసీల్దార్‌ చలమయ్య, ఇతర అధికారులు

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని ఎం.సున్నాపల్లి సముద్రం ఒడ్డుకు తుపాను ప్రభావంతో మంగళవారం కొట్టుకొచ్చిన మందిరాన్ని పోలి ఉన్న రథం మయన్మార్‌ దేశానికి చెందిందని అధికారులు గుర్తించారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ ఆదేశాల మేరకు తహసీీల్దార్‌ చలమయ్య, మెరైన్‌ సీీఐ దేవుళ్లు, నౌపడ ఎస్‌.ఐ.సాయికుమార్‌లు వెళ్లి పరిశీలించారు. బంగారు వర్ణంతో కూడిన రథంపై విదేశీభాష ఉండటాన్ని గుర్తించారు. వీటితో పాటు మందిరంపై 16-01-2022 తేదీ రాసి ఉంది. రథంపైన భాషను అంతర్జాలంలో శోధించగా అది మయన్మార్‌ దేశానికి చెందిందని, ఇది బంగారు రథం కాదని పేర్కొన్నారు. రెండేళ్ల కిందట ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతానికి ఇలాంటి రథమే ఒకటి కొట్టుకొచ్చిందని, అప్పట్లో అది శ్రీలంక దేశానికి చెందిందిగా గుర్తించారు. ఇదిలా ఉండగా దీన్ని మందిరంగా వినియోగించుకునేందుకు తమకు అవకాశమివ్వాలని ఎం.సున్నాపల్లి మత్స్యకారులు అధికారులను వేడుకున్నారు. 

- న్యూస్‌టుడే, సంతబొమ్మాళి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని