logo

Andhra News: ‘వాలంటీర్లు... దుస్తులూ ఉతికించుకుంటున్నారు’

‘ప్రభుత్వ పథకాలు, సేవల కోసం వచ్చిన వారితో కొందరు వాలంటీర్లు తమ ఇళ్లలో పనులు చేయించుకుంటున్నారు. చివరికి దుస్తులు కూడా ఉతికించుకుంటున్నారు’ అని వైకాపా కొండపి నియోజకవర్గ కన్వీనర్‌ వరికూటి అశోక్‌బాబు అన్నారు. గడప గడపకు మన

Updated : 16 May 2022 08:10 IST

సమావేశంలో మాట్లాడుతున్న వైకాపా కొండపి నియోజకవర్గ కన్వీనర్‌ అశోక్‌బాబు.. వేదికపై ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్రీనివాస విశ్వనాథ్‌, నాయకులు

టంగుటూరు(ప్రకాశం), న్యూస్‌టుడే: ‘ప్రభుత్వ పథకాలు, సేవల కోసం వచ్చిన వారితో కొందరు వాలంటీర్లు తమ ఇళ్లలో పనులు చేయించుకుంటున్నారు. చివరికి దుస్తులు కూడా ఉతికించుకుంటున్నారు’ అని వైకాపా కొండపి నియోజకవర్గ కన్వీనర్‌ వరికూటి అశోక్‌బాబు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ నిర్వహణలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో టంగుటూరు మండల పరిషత్తు కార్యాలయంలో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌బాబు హాజరై మాట్లాడారు. ప్రజలు తమకు అవసరమైన ప్రభుత్వ పనులు చేయించుకునేందుకు నాయకుల ఇళ్లకు వెళ్లడం మాని వాలంటీర్ల చుట్టూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కొందరు వాలంటీర్లు తమ ఇళ్లలోని దుస్తులను కూడా ప్రజలతో ఉతికించుకుంటున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. గడప గడపకు కార్యక్రమానికి నాయకులు కేవలం వారధులు మాత్రమేనని.. ప్రజలు అడిగిన ప్రశ్నలకు వాలంటీర్లే సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని చెప్పారు. సమీక్షా సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధి పర్యవేక్షణ అధికారి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ టి.శ్రీనివాస విశ్వనాథ్‌, వైకాపా మండల కన్వీనర్‌ సూదనగుంట హరిబాబు, కొండపి ఏఎంసీ ఉపాధ్యక్షుడు చింతపల్లి హరిబాబు, పలు మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని