logo

Road Accident: కన్నవారి కళ్లెదుటే కనుపాప ఛిద్రం

ఓ శుభకార్యం నిమిత్తం హైదరాబాద్‌ వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వెళ్లేముందు అందరికీ టాటా చెప్పిన ఆ చిన్నారి తిరిగిరాని లోకానికి

Updated : 18 May 2022 09:16 IST

బైకును ఢీకొన్న లారీ

నాలుగేళ్ల చిన్నారి మృతి, తల్లిదండ్రులకు గాయాలు

ఇవిక

కొత్తూరు, న్యూస్‌టుడే : ఓ శుభకార్యం నిమిత్తం హైదరాబాద్‌ వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వెళ్లేముందు అందరికీ టాటా చెప్పిన ఆ చిన్నారి తిరిగిరాని లోకానికి తరలిపోయింది. కన్నవారి కళ్లెదుటే కనుపాప ఛిద్రమై పోవడంతో కన్నపేగు విలవిల్లాడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు పురపాలిక కేంద్రం బైపాస్‌పై మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశంపేట మండలం, పాటిగడ్డకు చెందిన బోయపాటి ప్రశాంత్‌రెడ్డి (35) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. అతని భార్య దివ్యారెడ్డి (30) ఎయిడెడ్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. వీరికి బాబు విహాన్‌రెడ్డి (6) పాప ఇవిక (4) ఉన్నారు. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో నివాసం ఉంటున్న వీరు వేసవి సెలవులు రావడంతో సొంతూరుకు వచ్చారు. నగరంలో శుభకార్యం ఉండటంతో భార్య దివ్యారెడ్డి, కుమార్తె ఇవికతో కలిసి బైక్‌పై బయలుదేరారు. అంతకుముందు ప్రశాంత్‌రెడ్డి తల్లి శోరీలమ్మ, మనవడు విహాన్‌రెడ్డితో కలిసి బస్సులో వెళ్లారు. కొత్తూరు దర్గా బైపాస్‌ కూడలిలో బైకు మలుపు తిప్పుకుని వెళ్తుండగా.. షాద్‌నగర్‌ నుంచి వేగంగా వచ్చిన ఇటుకల లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా ఇవిక లారీ టైర్ల కిందపడి నుజ్జయ్యింది. కళ్లెదుటే జరిగిన ఈ సంఘటనతో కన్నవారు హతాశులయ్యరు. గాయపడిన వీరిని షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. దివ్యారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ బాలరాజు శంకర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు