logo

Suicide: పెళ్లి సంబంధం ఇష్టం లేక.. యువ ఇంజినీరు ఆత్మహత్య

తన మృతికి తానే కారణమని లేఖ రాసి ఓ యువ ఇంజినీర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. బాలాపూర్‌ మండలం గుర్రంగూడ బాపిరెడ్డి కాలనీలో

Updated : 18 May 2022 07:37 IST

శివరామకృష్ణ

బాలాపూర్‌: తన మృతికి తానే కారణమని లేఖ రాసి ఓ యువ ఇంజినీర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. బాలాపూర్‌ మండలం గుర్రంగూడ బాపిరెడ్డి కాలనీలో నివాసముంటున్న కొత్తగొల్ల కొండయ్య వ్యవసాయదారు. ఈయన కుమారుడు శివకృష్ణ(27) నారాయణఖేడ్‌లో మిషన్‌ భగీరథ పథకం ఏఈగా పనిచేస్తున్నాడు. శివకృష్ణకు ఓ యువతితో ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. ఈనెల 13న అతను గుర్రంగూడలోని సొంతింటికి వచ్చాడు. రెండు రోజుల తరువాత తండ్రి ఫోన్‌ చేయగా స్పందించలేదు. వెంటనే ఆయన తన పెద్ద కుమారుడికి ఫోన్‌ చేయగా.. అతను గుర్రంగూడలో తెలిసిన వ్యక్తికి ఫోన్‌చేశాడు. సోమవారం రాత్రి అతడు వెళ్లి తలుపు కొట్టినా శివకృష్ణ తలుపు తెరవకపోవడంతో పోలీసులకు సమాచారమిచాడు. వెంటనే వారు వచ్చి తలుపుతీయగా శివకృష్ణ నైలాన్‌ తాడుతో ఉరేసుకుని కనిపించాడు. అతని దుస్తులను పరిశీలించగా సూసైడ్‌ నోట్‌ కనిపించింది. పెళ్లి కుదిరినా అది ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని