logo

Andhra News: సీఎం జగన్‌ మాటే శిరోధార్యం: వల్లభనేని వంశీ

సీఎం జగన్‌ నాయకత్వంలో పని చేయడానికి సిద్ధపడే తాను వైకాపాకు మద్దతు పలికానని, ఆయన మాటే తనకు శిరోధార్యమని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్కొన్నారు. జగన్‌ చెప్పినా తనతో కలిసి పనిచేయనని....

Updated : 22 May 2022 10:24 IST

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ నాయకత్వంలో పని చేయడానికి సిద్ధపడే తాను వైకాపాకు మద్దతు పలికానని, ఆయన మాటే తనకు శిరోధార్యమని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్కొన్నారు. జగన్‌ చెప్పినా తనతో కలిసి పనిచేయనని దుట్టా రామచంద్రరావు పదేపదే చెబుతుండటం దేనికి సంకేతమో, వారి ఎజెండా ఏమిటో పార్టీ శ్రేణులు ఆలోచించుకోవాలని ఆయన పేర్కొన్నారు. శనివారం బాపులపాడు మండలం దంటగుంట్ల, రంగన్నగూడెం గ్రామాల్లో పర్యటించిన ఆయన స్థానిక విలేకర్లతోను, పార్టీ నాయకులతోనూ మాట్లాడారు. పార్టీ మారి ఎవరిపైనో పెత్తనం చేయడానికి తాను రాలేదని, ప్రజాసేవ, అభివృద్ధి కార్యక్రమాల కోసమే తాను జగన్‌ వద్దకు వెళ్లానన్నారు. సొంత నియోజకవర్గమై ఉండి, స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన గద్దె రామ్మోహన్‌ సతీమణి జడ్పీ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఉంగుటూరులో బరిలోకి దిగితేనే ఏకగ్రీవం సాధ్యం కాలేదని, కానీ దుట్టా కుమార్తె ఏ విధంగా ఏకగ్రీవంగా జడ్పీటీసీగా గెలుపొందారో అందరికీ తెలిసిందేనన్నారు. తెదేపాలో ఉండగానే తాను వైకాపా వారిని వేధించలేదని, వ్యక్తిగత గొడవలు, గ్రామ రాజకీయాల నేపథ్యంలో కేసులు పెట్టుకుంటే వాటిని తనకు ఆపాదించారన్నారు. ఇప్పుడు కూడా తాను తెదేపా వారిని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టడం లేదన్నారు. ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించింది నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసమేనని గుర్తెరిగి తాను పనిచేస్తున్నానన్నారు. మట్టి, గ్రావెల్‌ అమ్ముకుని రాజకీయాలు చేయాల్సి అవసరం తనకు లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని