logo

Shekar: ‘శేఖర్‌’ సినిమా ప్రదర్శనకు న్యాయస్థానం అనుమతి

రాజశేఖర్‌ హీరోగా నటించిన ‘శేఖర్‌’ను ప్రదర్శన కొనసాగించవచ్చని సిటీ సివిల్‌ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా ప్రదర్శనపై సోమవారం న్యాయస్థానంలో వాదనలు

Updated : 24 May 2022 07:19 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాజశేఖర్‌ హీరోగా నటించిన ‘శేఖర్‌’ను ప్రదర్శన కొనసాగించవచ్చని సిటీ సివిల్‌ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా ప్రదర్శనపై సోమవారం న్యాయస్థానంలో వాదనలు కొనసాగాయి. ఈ చిత్ర ప్రదర్శన నిలిపివేస్తూ న్యాయస్థానం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తదుపరి వాదనలు సోమవారం జరిగాయి.  సినిమా ఆగిపోవడంతో తమకు ఎంతో నష్టం జరుగుతోందని,  నిలిపివేతపై ఉన్న స్టేను రద్దు చేయాలని చిత్ర దర్శకురాలు జీవితా రాజశేఖర్‌ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. కోర్టులో కేసు దాఖలు చేసిన పరంధామరెడ్డి తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ సినిమా ప్రదర్శన కొనసాగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. ప్రదర్శన ద్వారా వచ్చే కలెక్షన్లలో తమ క్లయింటుకు ఇవ్వాల్సిన రూ.87.10లక్షలను న్యాయస్థానంలో డిపాజిట్‌ చేయించాలని కోరారు. ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. దీనికి జీవితారాజశేఖర్‌ తరఫు న్యాయవాదులు అంగీకరించారు. ప్రత్యేక ఖాతా తెరిచి డబ్బు డిపాజిట్‌ చేస్తామని, రెండు రోజుల్లో ఖాతా వివరాలు కోర్టుకు తెలియజేస్తామన్నారు. దీంతో సినిమా ప్రదర్శనకు అనుమతిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని