logo

Gudiwada: బ్రీత్‌ ఎనలైజర్‌లో ఏకంగా 530 పాయింట్లు.. ఈ రీడింగ్‌ ఎన్ని బీర్లకు సమానమో తెలుసా?

గుడివాడ సమీప వెంట్రప్రగడకు చెందిన ఓ వ్యక్తి పీకలదాకా తాగి ద్విచక్ర వాహనంపై గింగిరాలు కొడూతూ శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో బందరు రోడ్డుపై హడావుడి చేసి పోలీసులకు చిక్కాడు.

Updated : 12 Jun 2022 09:38 IST


రీడింగ్‌ పర్సంటేజీని చూపుతున్న సీఐ గోవిందరాజు

గుడివాడ సమీప వెంట్రప్రగడకు చెందిన ఓ వ్యక్తి పీకలదాకా తాగి ద్విచక్ర వాహనంపై గింగిరాలు కొడూతూ శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో బందరు రోడ్డుపై హడావుడి చేసి పోలీసులకు చిక్కాడు. అదే సమయంలో పెనమలూరు సీఐ గోవిందరాజు అతడికి బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్ష నిర్వహించగా రీడింగ్‌ పర్సంటేజీ ఏకంగా 530 పాయింట్లు చూపించడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఇది 15కు పైగా బీరు సీసాలు సేవించిన దానితో సమానమని గుర్తించారు. అతడి వాహనాన్ని సీజ్‌ చేసి కుటుంబ సభ్యులకు సమాచారం పంపగా.. వారు వచ్చి ఇంటికి తీసుకెళ్లారు. అతను వేరే మార్గంలో వెళ్లినట్లయితే రోడ్డు ప్రమాదానికి గురయ్యేవాడని పోలీసులు తెలిపారు. అలాగే వాహన తనిఖీల్లో మరో నలుగురు మందుబాబులను పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

- పెనమలూరు, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని