logo

Andhra News: చేతిరాత పోటీల్లో కలెక్టర్‌ తనయుడి ప్రతిభ

మూడేళ్లకోసారి నిర్వహించే రాష్ట్రస్థాయి కాలిగ్రఫీ (చేతిరాత) పోటీల్లో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి తనయుడు జివితేష్‌ ప్రథమస్థానంలో నిలిచినట్లు హ్యాండ్‌ రైటింగ్‌

Updated : 15 Jun 2022 11:02 IST

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: మూడేళ్లకోసారి నిర్వహించే రాష్ట్రస్థాయి కాలిగ్రఫీ (చేతిరాత) పోటీల్లో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి తనయుడు జివితేష్‌ ప్రథమస్థానంలో నిలిచినట్లు హ్యాండ్‌ రైటింగ్‌ ట్రైనింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధి, విజయవాడకు చెందిన శిక్షకుడు పి.భువనచంద్ర మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 7 నుంచి 10వ తరగతి విద్యార్థులు 1672 మంది ఆన్‌లైన్‌ పరీక్షలో పాల్గొనగా జివితేష్‌ ప్రథమస్థానంలో నిలిచి లెజెండ్‌ హ్యాండ్‌ రైటింగ్‌ అవార్డుకు, జాతీయస్థాయి ఒలింపియాడ్‌కు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ పోటీల్లో విశాఖపట్నంలోని ప్రభుత్వ పాఠశాల 8వ తరగతి విద్యార్థిని ఆదిరెడ్డి మనుశ్రీ ద్వితీయస్థానంలో, పల్నాడు జిల్లా దుర్గిలోని ఏపీ మోడల్‌ పాఠశాల 10వ తరగతి విద్యార్థిని పులి పూజిత తృతీయస్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని