logo

Presidential Election: ద్రౌపది ముర్ముకు ఓటు వేయను: ఒడిశా నేత

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థిగా రంగంలో నిలిచిన ద్రౌపది ముర్ముకు ఓటు వేయబోనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కాంగ్రెస్‌ శాసనసభా పక్షం నేత నర్సింగ్‌ మిశ్ర చెప్పారు.

Updated : 24 Jun 2022 07:39 IST

కాంగ్రెస్‌ నేత నర్సింగ్‌ మిశ్ర

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థిగా రంగంలో నిలిచిన ద్రౌపది ముర్ముకు ఓటు వేయబోనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత నర్సింగ్‌ మిశ్ర చెప్పారు. గురువారం భువనేశ్వర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ద్రౌపది ముర్ము మంచి వ్యక్తిత్వం ఉన్న మహిళ అని, వక్త అని, ఆమెతో కలసి శాసనసభలో అయిదేళ్లు పనిచేశానని చెబుతూనే భాజపా, ఆర్‌.ఎస్‌.ఎస్‌. విధానాలకు ప్రాధాన్యం ఇస్తారని వివరించారు. అందువల్లే ఆమెకు తాను ఓటు వేయబోనని తెలిపారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయం మేరకు యశ్వంత్‌ సిన్హాకు ఓటు వేస్తానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని