logo

Chandrababu: మది నిండుగా పసుపు పండగ.. ఎల్‌ఈడీ స్క్రీన్స్‌పై వీక్షించిన ప్రజలు, తెదేపా శ్రేణులు

ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రుల ప్రమాణ స్వీకారంపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లాలో వాడవాడలా కూటమి శ్రేణులు సంబరాలు నిర్వహించాయి

Updated : 13 Jun 2024 08:50 IST

బాపట్ల, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రుల ప్రమాణ స్వీకారంపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లాలో వాడవాడలా కూటమి శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. కేకులు కోసి బాణసంచా కాల్చారు. మిఠాయిలు పంపిణీ చేశారు. జిల్లా అంతటా పండగ వాతావరణం నెలకొంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అయిదు బస్సుల్లో తెల్లవారుజామునే నాయకులు, కార్యకర్తలు గన్నవరం సమీపంలో కేసరపల్లి ప్రమాణ స్వీకార వేదిక వద్దకు బయలుదేరి వెళ్లారు. ప్రమాణ స్వీకారాన్ని సామాన్య ప్రజలు వీక్షించటానికి పట్టణాలు, మండల కేంద్రాలు, పల్లెల్లో కల్యాణ మండపాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమైన కూడళ్ల వద్ద ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. బాపట్లలో ఏజీ కళాశాల బీవీ నాథ్‌ ఆడిటోరియం, రోటరీ కల్యాణ మండపం, కిరాణా వర్తకుల కల్యాణ మండపం, చీరాలలో బాలుర ఉన్నత పాఠశాల ఓపెన్‌ థియేటర్, రేపల్లె, అద్దంకిలో ప్రైవేటు కల్యాణ మండపాల్లో, వేమూరు కూడలి, పర్చూరు బొమ్మల సెంటర్, మండల కేంద్రాల్లోని మండల పరిషత్తు కార్యాలయాలు, గ్రామాల్లో ఆర్బీకేలు, సచివాలయాల్లో ఎల్‌ఈడీ తెరలు, టీవీల ద్వారా సీఎం చంద్రబాబు, మంత్రుల ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించటానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. స్థానికులతో కలిసి అధికారులు, సిబ్బంది ప్రమాణ స్వీకారాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో పూజలు నిర్వహించారు. శ్రేణుల కార్యకర్తలు ఆనందంతో నృత్యాలు చేశారు.

బాపట్లలో బాణసంచా కాలుస్తూ తెదేపా నేతల సంబరాలు 

రేపల్లె పట్టణంలోని రాజ్యలక్ష్మి కూడలిలో.. 


చీరాల అర్బన్‌: దేశాయిపేటలో తెదేపా నాయకులు, కార్యకర్తల సందడి 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని