logo

మన మినిస్టార్స్‌.. వీరేనండోయ్‌!

మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ వీడింది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి నలుగురిని మంత్రి పదవులు వరించాయి. వైకాపా అరాచక పాలనపై యువగళం పాదయాత్ర ద్వారా అలుపెరగని పోరాటం చేసిన మంగళగిరి శాసనసభ్యుడు,

Published : 12 Jun 2024 05:14 IST

మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ వీడింది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి నలుగురిని మంత్రి పదవులు వరించాయి. వైకాపా అరాచక పాలనపై యువగళం పాదయాత్ర ద్వారా అలుపెరగని పోరాటం చేసిన మంగళగిరి శాసనసభ్యుడు, యువనేత నారా లోకేశ్‌కు అమాత్య యోగం దక్కింది. జనసేనకు.. జనసేనానికి వెన్నుదన్నుగా నిలిచిన తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌ను మంత్రి పదవి వరించింది. రేపల్లె నుంచి హ్యాట్రిక్‌ విజయం సొంతం చేసుకున్న బీసీ నేత అనగాని సత్యప్రసాద్‌కు చోటుదక్కింది. అద్దంకి నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ.. వైకాపా వేధింపులకు ఎదురొడ్డి... తెదేపా జెండా రెపరెపలాడించిన గొట్టిపాటి రవికుమార్‌కు మంత్రి వర్గంలోకి ఆహ్వానం పలికారు. మొత్తంగా గుంటూరు జిల్లా నుంచి ఇద్దరు, బాపట్ల జిల్లా నుంచి ఇద్దరికి పదవులు దక్కగా.. పల్నాడు జిల్లా నుంచి ఎవరికీ ప్రాతినిధ్యం లభించలేదు. 

ఈనాడు, అమరావతి 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని