logo

అప్పులపాలై ఆత్మహత్య

అప్పులపాలై మానసికంగా కుంగిపోయిన వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

Published : 12 Jun 2024 05:16 IST

యడ్లపాడు, న్యూస్‌టుడే: అప్పులపాలై మానసికంగా కుంగిపోయిన వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రత్తిపాడు మండలం పాత మల్లాయపాలేనికి చెందిన వజ్రాల సుబ్బారెడ్డి(37)అత్తగారి ఊరు రాష్ట్ర రాజధాని పరిధిలోని తుళ్లూరు మండలం పెదపరిమి. వ్యయసాయం చేస్తూ 10 ఏళ్లుగా అక్కడే నివసిస్తున్నాడు. సోమవారం ఉదయం అతడు పాత మల్లాయపాలెం వెళుతున్ననట్లు భార్య వరలక్షితో చెప్పి ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఈ నేపథ్యంలో యడ్లపాడు మండలం బోయపాలెంలోని ఈద్గా వద్ద మంగళవారం ఉదయం మృతదేహం స్థానికులకు కనిపించటంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి మృతుడు సుబ్బారెడ్డిగా గుర్తించారు. మృతదేహం పక్కన ద్విచక్ర వాహనం, క్రిమిసంహారక మందు సీసా ఉంది. కుటుంబ ఖర్చులకు తీసుకున్న రూ.లక్షల అప్పులు పెరిగిపోవటంతో మానసికంగా కుంగిపోయి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి భార్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పెదపరిమిలో వైకాపా నేతగా వ్యవహరించే సుబ్బారెడ్డి.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సుమారు రూ.30 లక్షలు బెట్టింగ్‌లో పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని