logo

వ్యక్తిగత కక్షతో దాడి

వ్యక్తి గత కక్షతో ఓ వ్యక్తిపై దాడి జరిగింది. వన్‌టౌన్‌ సీఐ దశరళీరామారావు, స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని 16వ వార్డు వైకాపా నాయకుడు కాళిదాసు సత్యనారాయణ మంగళవారం

Published : 12 Jun 2024 05:18 IST

గాయాలతో సత్యం

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: వ్యక్తి గత కక్షతో ఓ వ్యక్తిపై దాడి జరిగింది. వన్‌టౌన్‌ సీఐ దశరళీరామారావు, స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని 16వ వార్డు వైకాపా నాయకుడు కాళిదాసు సత్యనారాయణ మంగళవారం స్థానిక బోస్‌రోడ్డులోని హోటల్‌ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక్క సారిగా వెనుక నుంచి వచ్చిన అబ్దుల్లా కత్తితో అతని వీపు, కాళ్లు, చేతులు, పొట్టపై పొడిచాడు. స్థానికులు వెంటనే అతన్ని పట్టుకొనేందుకు యత్నించగా పారిపోయాడు. బాధితుడు సత్యనారాయణను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వైద్యులు చికిత్స అందించారు. అబ్దుల్లా కుటుంబానికి రేషన్‌ దుకాణం ఉంది. ఆ దుకాణంలో సరకుల పంపిణీ సరిగ్గా ఉండటం లేదని సత్యనారాయణ పౌర సరఫరాల అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేయగా తనిఖీలు చేశారు. తమను ఇబ్బంది పెట్టాలని సత్యనారాయణ కావాలనే ఇదంతా చేస్తున్నాడని అబ్దుల్లా అతనిపై కక్ష్య పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈ దాడి జరిగింది. ఇరువురి నడుమ ఉన్న వ్యక్తిగత గొడవ వల్ల ఇది జరిగిందని, రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదని సీఐ వివరించారు. నిందితుడు అబ్దుల్లా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని