logo

జిల్లాలో ట్రాఫిక్‌ మళ్లింపు

కృష్ణజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఈ నెల 12న జరిగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.

Published : 12 Jun 2024 05:20 IST

ఎస్పీ తుషార్‌ దూడి

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : కృష్ణజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఈ నెల 12న జరిగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా పరిధిలో ట్రాఫిక్‌ మళ్లింపు చేపట్టినట్లు ఎస్పీ తుషార్‌ దూడి మంగళవారం తెలిపారు. గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు గుంటూరు బుడంపాడు జంక్షన్‌ వద్ద జాతీయ రహదారి దిగి తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూడి బ్రిడ్జి, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా వెళ్లాలని చెప్పారు. అలాగే చెన్నై నుంచి బాపట్ల, చీరాల వైపు వెళ్లే వాహనాలు గుంటూరు ఏటుకూరు అండర్‌ పాస్‌ కింద నుంచి ప్రత్తిపాడు, పర్చూరు, చీరాల, బాపట్ల నుంచి జాతీయ రహదారి మీదుగా వెళ్లాలన్నారు. గుంటూరు నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలు పేరేచర్ల జంక్షన్‌ నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదుగ హైదరాబాద్‌ వెళ్లాలని, విజయవాడ వైపు అనుమతించరని తెలిపారు. చెన్నై నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల మీదుగ హైదరాబాద్‌కు ప్రయాణించాలని కోరారు. గుంటూరు నుంచి విజయవాడ వైపు ఎటువంటి వాహనాలు అనుమతించరని ఆయన పేర్కొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసే వరకు ట్రాఫిక్‌ మళ్లింపు అమల్లో ఉంటుందని ఎస్పీ చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని