logo

అమరావతి నిర్మాణం వేగంగా జరగాలి

అమరావతి విశ్వనగరంగా విరాజిల్లుతుందని తాళ్ళాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి అశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో పూజలు నిర్వహించారు.

Updated : 12 Jun 2024 05:43 IST

శంకుస్థాపన ప్రాంతంలో పూజలు చేస్తున్న శివస్వామి, రాజధాని రైతులు, మహిళలు

తుళ్లూరు, న్యూస్‌టుడే: అమరావతి విశ్వనగరంగా విరాజిల్లుతుందని తాళ్ళాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి అశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో పూజలు నిర్వహించారు. రైతులు ఈ సందర్భంగా ‘జై అమరావతి.. ఆంధ్రుడు మేలుకొన్నాడు..అమరావతి నిలిచింది.. స్వర్ణాంధ్ర కలను సాకారం చేద్దాం’ అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడుతూ అమరావతిని నాశనం చేయాలని చూసిన వైకాపా అధినేత జగన్‌కు రాష్ట్ర ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. అమరావతి రూపకర్త చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అమరావతి వేగంగా అభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు. అమరావతికి ఏర్పడిన అవరోధాలు తొలగిపోయి నవ నిర్మాణాలతో రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారాలని సంకల్పించారు. తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు మాధవ నాయడు, రామకృష్ణ, రైతులు, రైతుకూలీలు, మహిళలు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని