logo

జాతరే.. జాతర

తెలుగుదేశం-జనసేన-భాజపా కూటమి ప్రభుత్వం కొలువుదీరే సమయం ఆసన్నమైంది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Updated : 12 Jun 2024 05:43 IST

సీఎం ప్రమాణ స్వీకారం సందర్భంగా జిల్లాలో సంబరాలు 
కేసరపల్లి వేదిక వద్దకు తరలివెళ్తున్న కూటమి శ్రేణులు 
ద్యుత్తు వెలుగుల్లో ప్రభుత్వ కార్యాలయాలు 

బాపట్ల, న్యూస్‌టుడే : తెలుగుదేశం-జనసేన-భాజపా కూటమి ప్రభుత్వం కొలువుదీరే సమయం ఆసన్నమైంది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మహోత్సవానికి దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, ఆయా రాజకీయపక్షాల అగ్రనేతలు, అభిమాన సినీతారలు మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హాజరవుతున్నారు. వేడుకలా నిర్వహిస్తున్న చంద్రబాబునాయుడు పట్టాభిషేక కార్యక్రమాన్ని కనులారా తిలకించటానికి కూటమి నేతలు, శ్రేణులు ఉత్సాహం చూపుతున్నారు. వెలగపూడి సచివాలయం నుంచి ప్రతి నియోజకవర్గానికి ఐదు బస్సులు ఏర్పాటుచేయడంతో పాటు పాస్‌లు పంపిణీ చేశారు. ప్రమాణ స్వీకారం జరిగే గన్నవరం సభా ప్రాంగణానికి బస్సుల్లో తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు బయలుదేరి వెళ్లనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టి కొలువు తీరనున్న నేపథ్యంలో జిల్లా అంతటా పండగ వాతావరణం నెలకొంది. జిల్లాలో పలుచోట్ల కేకులు కోసి పంచిపెట్టారు. తెదేపా శ్రేణులు ఆలయాల్లో పూజలు చేశారు. పలుచోట్ల పార్టీ శ్రేణులు ప్రదర్శనలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌తో పాటు ఇతర కార్యాలయాలను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. చీరాల, అద్దంకి, రేపల్లె పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్తు వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు తిలకించడానికి పట్టణాల్లో భారీ ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. 

బాపట్లలో కేకు కోస్తున్న ఎమ్మెల్యే నరేంద్రవర్మ

శింగరకొండకు పాదయాత్రగా వెళ్తున్న దామావారిపాలెం వాసులు

ఇంకొల్లు : కూటమి విజయోత్సవ సంబరాల్లో  తెదేపా నాయకులు, అభిమానులు

చీరాల పురపాలక సంఘ కార్యాలయానికి విద్యుద్దీపాలంకరణ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని