logo

పలు కేసుల్లో పిన్నెల్లికి ముగియనున్న గడువు

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం, పలుచోట్ల దాడి కేసుల్లో ప్రధాన నిందితుడైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయకుండా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం రెండోసారి ఇచ్చిన ఉత్తర్వుల గడువు నేటితో ముగియనుంది

Published : 13 Jun 2024 05:39 IST

నరసరావుపేట టౌన్, న్యూస్‌టుడే : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం, పలుచోట్ల దాడి కేసుల్లో ప్రధాన నిందితుడైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయకుండా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం రెండోసారి ఇచ్చిన ఉత్తర్వుల గడువు నేటితో ముగియనుంది. దీనిపై గురువారం న్యాయస్థానం విచారించనుంది. తదుపరి ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. నరసరావుపేటలోని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఆయన హాజరై రిజిస్టర్‌లో సంతకం చేశారు. రావిపాడు రెవెన్యూ పరిధిలో ఆయన బస చేసిన విల్లా చుట్టూ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని