logo

మంత్రివర్గ కూర్పు భేష్‌: ఎమ్మెల్యే జీవీ

రాష్ట్ర మంత్రివర్గ కూర్పు బాగుందని, సామాజిక సమతూకం పాటిస్తూ యువతరానికి పెద్దపీట వేశారని శాసనసభ్యుడు జీవీ ఆంజనేయులు తెలిపారు.

Published : 13 Jun 2024 05:58 IST

వినుకొండ, న్యూస్‌టుడే : రాష్ట్ర మంత్రివర్గ కూర్పు బాగుందని, సామాజిక సమతూకం పాటిస్తూ యువతరానికి పెద్దపీట వేశారని శాసనసభ్యుడు జీవీ ఆంజనేయులు తెలిపారు. ఈమేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ 17 మంది కొత్తవారికి అవకాశం కల్పించడం సాహసోపేతమైన నిర్ణయమని, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనమన్నారు. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించేలా మంత్రుల ఎంపికలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని ఆయన కితాబునిచ్చారు. ముగ్గురు మహిళలకు చోటు కల్పించడంతో పాటు అన్ని కులాలను ఇందులో ప్రతిబింపజేశారని తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణ సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంచుకున్న ఈ జట్టు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రపథాన నిలుపుతుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని