logo

గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ జరిపించాలి

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 13 Jun 2024 06:03 IST

లక్ష్మణరెడ్డి  

గుంటూరు నగరం: గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. అవినీతికి పాల్పడిన వారిపై నిష్పక్షపాతంగా విచారణ చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలని తద్వారా భవిష్యత్తులో రాజకీయ, అధికార అవినీతికి ఆస్కారం లేకుండా చేయాలని కోరారు. వైకాపా ప్రభుత్వ హయాంలో పలు పథకాలకు ఆ పార్టీ నేత పేరు పెట్టుకున్నారని, వాటిని తొలగించి అమరులైన మహానీయుల పేర్లను పెట్టాలని సూచించారు. నూతన మంత్రివర్గ కూర్పులో అన్ని ప్రాంతాలు, కులాలు, మతాలకు ప్రాతినిధ్యం కల్పించి మంచి టీంను చంద్రబాబు ఎంపిక చేశారని తెలిపారు. వైకాపా పాలనలో ప్రచార పిచ్చి పరాకాష్ఠకు చేరిందన్నారు.అందుకే అరాచక, అభివృద్ధి నిరోధక పాలనను ఓటర్లు కసితో తిరస్కరించారన్నారు. బూతులు మాట్లాడే నేతలను, అరాచక, అనినీతి శక్తులను ప్రజలు ఓడించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర వాటా చెల్లించి అన్ని పథకాలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. విధ్వంసాలు, కక్ష సాధింపు చర్యలుండవని, తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని తెదేపా, జనసేన అధినేతలు ప్రకటించడాన్ని గమనించి స్థానిక నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో వ్యవహరించాలని లక్ష్మణరెడ్డి తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని