logo

ప్రమాణ స్వీకారం చూసి.. పరవశించి..

రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని జిల్లా ప్రజలు చూసి పరవశించారు

Published : 13 Jun 2024 06:05 IST

ఎన్టీఆర్‌ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలు, అభిమానులు 

కలెక్టరేట్‌ (గుంటూరు), న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని జిల్లా ప్రజలు చూసి పరవశించారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లలో ప్రజలు వీక్షించేందుకు వీలుగా అధికార యంత్రాంగం ఎల్‌ఈడీ స్క్రీన్‌లు, టెంట్‌లు ఏర్పాటు చేసింది. దీంతో ప్రజలు ఆయా స్క్రీన్‌ల వద్ద కూర్చుని మహాఘట్టాన్ని వీక్షించారు. 

ఎక్కడెక్కడంటే..: జిల్లా వ్యాప్తంగా రెండు నగరపాలక, రెండు పురపాలక సంఘాల పరిధిలో 36 ప్రదేశాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఉంచారు. ప్రతీ స్క్రీన్‌ వద్ద టెంట్‌ ఏర్పాటు చేసి ప్రజలు కూర్చునేందుకు కుర్చీలు వేశారు. టెంట్ల వద్దకు వచ్చి ప్రజలు, అభిమానులు ఈ ఘట్టాన్ని వీక్షిస్తూ కరతాళ ధ్వనులు, విజిల్స్‌తో చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.  గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 13 ప్రదేశాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లలో సభ ప్రారంభం నుంచే ప్రదర్శన ప్రారంభించారు.  పొన్నూరులో మూడు చోట్ల, మంగళగిరి-తాడేపల్లి పట్టణంలో 14 ప్రదేశాల్లో, తెనాలి పట్టణంలో ఐదు ప్రదేశాల్లోనూ, ఏఎన్‌యూలో ఒక స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని