logo

అమరావతి రక్షకా.. గోవిందా

అమరావతి రూపశిల్పి నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా చూడాలన్న సంకల్పం నెరవేరిన సందర్భంగా రాజధాని గ్రామం అనంతవరం కొండపై స్వయంభూ వేంకటేశ్వరస్వామికి శనివారం రాజధాని రైతులు మొక్కులు చెల్లించుకున్నారు.

Published : 16 Jun 2024 05:05 IST

శ్రీవారికి మొక్కులు చెల్లించిన రాజధాని రైతులు

తుళ్లూరు, న్యూస్‌టుడే: అమరావతి రూపశిల్పి నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా చూడాలన్న సంకల్పం నెరవేరిన సందర్భంగా రాజధాని గ్రామం అనంతవరం కొండపై స్వయంభూ వేంకటేశ్వరస్వామికి శనివారం రాజధాని రైతులు మొక్కులు చెల్లించుకున్నారు. మెట్టుమెట్టుకు కొబ్బరికాయలు కొట్టి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండపైన ఉన్న ఆలయానికి చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు. అమరావతి నిర్మాణం శరవేగంగా జరగాలని శ్రీవారిని వేడుకున్నారు. ‘అమరావతి రక్షకా గోవిందా..జై అమరావతి’ అని నినాదాలు చేశారు.అనంతవరం గ్రామానికి చెందిన మువ్వా శేషగిరి, సుజాత, ఎం రాధకృష్ణమూర్తి, మంజువాణి, తరిగోపుల సుధాకర్, శివకుమారి దంపతులు ఆలయం వద్ద 1100 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. మహిళలు మాట్లాడుతూ అమరావతిని కాపాడుకోవటానికి నాలుగున్నర సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడ్డామని, కూటమి ప్రభుత్వం రాకతో ఆ బాధలన్నీ తొలగిపోయాయని సంతోషం వ్యక్తం చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని